Home Epaper అనంత పద్మనాభ స్వామి దేవాలయం పునర్ వైభవం కోసమని

అనంత పద్మనాభ స్వామి దేవాలయం పునర్ వైభవం కోసమని

by V.Rajendernath

దుద్యాల స్వామీజీ సర్వేశ్వరా శివ యోగి అంబికా స్వామి

పటాన్చెరు ఏప్రిల్ 16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)-; సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలో గల హనుమాన్ మందిరం నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు గ్రామలోని ప్రధాన విధుల గుండా రామ సంకీర్తన చేసుకుంటూ వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుద్యాల స్వామీజీ శ్రీ సర్వేశ్వర శివయోగి అంబికా శివ స్వామి పాల్గొనడం జరిగింది. ముందుగా హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత గ్రామం యొక్క వీధుల గుండా రామనామ సంకీర్తనని చేస్తూ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్లడం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అత్యంత పురాతనమైందని, ఇది ఎంతో గొప్ప స్థల పురాణం కలదని, ఇక్కడ కొద్ది మంది రామ సంకీర్తన చేస్తూ హనుమంతుని యొక్క విగ్రహాన్ని మలిచి, వారి యొక్క జన్మను పునీతం చేసుకున్నారని ఇట్లాంటి దేవాలయం మన తెలంగాణలో మూడు మాత్రమే ఉన్నాయని, వారు పేర్కొనడం జరిగింది. దేవాలయం యొక్క గోడల పైన మధ్యలో హనుమంతుడు హనుమంతునికి ఎడమవైపు గణపతి స్వామి హనుమంతుని యొక్క పాదాల కింద శనేశ్వర స్వామి ఇట్లాంటి అరుదైన దేవాలయం తెలంగాణలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఇది ఎంతో శక్తివంతమైన దేవాలయం అని ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని తెలియజేయడం జరిగింది. భక్తులందరూ మన యొక్క ధర్మ రక్షణలో అందరూ నడుము కట్టి కలిసి జీవించాలని, కులాలకతీతంగా పార్టీలకతీతంగా హిందూధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి ముందుకు వెళ్లాలని సూచించారు. దేవాలయాల ఆస్తిని రక్షించి రాబోయే తరాలకు అందించాలని వాళ్లకు మనం ఇచ్చే వారసత్వ సంపద ఇదేనని వారు పేర్కొన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార పరిషత్ కోఆర్డినేటర్ మధురనేని సుభాష్ చంద్రర్ మాట్లాడుతూ మన దేశంలో అనేక దాడులు చేసి ఈ దేవాలయాలను మన సంస్కృతిని విదర్మీయులు దాడి చేసి ధ్వంసం చేశారని, దాన్ని రక్షించుకొని పునర్వైభవంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి హిందూపైన ఉందని ప్రతి హిందువు తన యొక్క ధర్మరక్షణకు నడుము కట్టాలని దీంట్లో రాజకీయాల కతీతంగా ముందుండాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న ముందు తాను హిందువుగా గుర్తించుకోవాలని ఆ తర్వాతనే తన పార్టీని గుర్తించుకోవాలని ఆ విధమైన దారిలో ఉన్నప్పుడే మన ధర్మం కాపాడబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాది కొత్త కాపు జగన్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment