Home Epaper డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ ఘనంగా జయంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ ఘనంగా జయంతి వేడుకలు

by V.Rajendernath

పటాన్చెరు ఏప్రిల్ 14 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)-;భారత
రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా జిన్నారం గ్రామంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి మండల అధ్యక్షులు వంగేటి రాజిరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి జై భీమ్ అనే నినాదాలతో అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పంగేటి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షులు ఈదుగాని మల్లేష్ ముఖ్యంగా సుధాకర్ దోమడుగు రమేష్ శంకర్ అశోక్ రాము గ్రామం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు మల్లేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది కార్యక్రమంలో వార్డు మెంబర్లు గ్రామస్తులు యువజన సంఘాలు కార్యకర్తలు నాయకులు, కుల మత భేదాలు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది

You may also like

Leave a Comment