Home Epaper కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి భా ఫూలే…

కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి భా ఫూలే…

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

కుల వివక్షతకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంగసంస్కర్త, మానవతా వాది మహాత్మా జ్యోతిబా పూలే అని, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతిబాపూలే చిత్ర పటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఆతర్వాత ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప మానవతా వాది అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం చరిత్ర అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ జయ ప్రకాష్ జ్యోతిబాపూలే జీవితం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1, 2 విభాగం తరపున ప్రోగ్రాం అధికారులు బి. కృష్ణ ప్రసాద్, ఎస్.గోదావరి లు విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఫరీదుద్దీన్, ప్రభాకర్ రావు, గంగా రెడ్డి, సిద్దు రాజు, కృష్ణ ప్రసాద్, వినయ కుమార్, చంద్ర కాంత, మోహిన్, రాణి, గోదావరి, డాక్టర్ సిద్ధ లక్ష్మి, అధ్యపకేతర బృందం, విద్యార్ధినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment