ఘట్కేసర్ ఏప్రిల్ 11(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మున్సిపల్ కేంద్రం లోని అంబేద్కర్ కూడలి వద్ద బర్ల దేవేందర్,రాధాకృష్ణ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 196 వ జయంతి వేదుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్,మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారత దేశ మొట్ట మొదటి సంఘ సంస్కర్థ అని,అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు అని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, కడపొల్ల మల్లేష్,కుతాడి రవీందర్, జహంగీర్,ఘాట్కేసర్ మాజీ సర్పంచ్
అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు విప్పర్ల హనుమాన్,డాక్టర్ మల్లేష్, మీసాల అరుణ్ కుమార్,మహమ్మద్ ఖయ్యుమ్, ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు