కామారెడ్డి, ఏప్రిల్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు పాల్గొన్న కామారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరంలో కామారెడ్డిజిల్లా అధ్యక్షులు నిట్టువిట్టల్ రావు మాట్లాఫుతు, నిరసనదీక్షలో పాల్గొన్న కామారెడ్డి జిల్లాలోని యూనిట్ శాఖల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఇట్టి దీక్షలో సుమారు 250మంది విశ్రాంతఉద్యోగులు హాజరవివాదం తమ ఐక్యమత్యానికి నిదర్శనం అన్నారు. దీక్ష అనంతరం డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ ని కలిసి అందించారు.
మార్చి 2023 మాసం న కు సంబంధించిన పెన్షన్ లోబేసిక్ పే, 20.20 శాతం డి ఆర్, 600మెడికల్ ఆలోవెన్సు, 15/36ఆర్ పి ఎస్ ఏరియేర్స్, 2/8 డి ఆర్ ఏరియర్స్, 70 ఏళ్ళు సై బడిన వారికి కె పెన్షన్, ఫిబ్రవరి 2023లో ఆదాయ పన్ను వల్ల కొందరికి పెన్షన్ తక్కువ వచ్చిందని వారు డిమాండ్ లు తెలిపారు.
ఈ దీక్షలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పప్పు విశ్వనాథం, జిల్లా జనరల్ సెక్రెటరీ గంగా గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాశీనాథం, ఎల్లారెడ్డి మండల యూనిట్ అధ్యక్షులు ఆకుల కిష్టయ్య , అసోసియేట్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, కామారెడ్డి యూనిట్ అధ్యక్షులు ఎస్ ఉపేందర్, మండల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.