Home తాజా వార్తలు ఎల్లారెడ్డి ఐటీఐ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు నిరసన ….

ఎల్లారెడ్డి ఐటీఐ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు నిరసన ….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 10,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఎదుట , గురువారం ఏబీవిపి ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 లో ఎల్లారెడ్డికి మంజూరు అయిన కళాశాలను 5 కోర్సులలో నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తే కొట్లాడి 2010 డిసెంబర్ లో ఎల్లారెడ్డి తీసుకురావడం జరిగిందని, ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న కళాశాలలో 5 కోర్సులకు నేడు కేవలం ఒకే కోర్స్ ను కొనసాగించడం సమంజసం కాదని, ఈ విషయమై ఉన్నతాధికారులను అడిగితే సిబ్బంది లేని కారణంగా కోర్సుల కుదింపు చేయడం జరిగిందని చెప్పారన్నారు. 2.5 కోట్లతో అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్న కళాశాలలో నేడు పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే సిబ్బంది కొరత లేకుండా చూసి, విద్యార్థులకు ఉపాధి కలిగే విధంగా తిరిగి 5 కోర్సులలో ఐటీఐ కళాశాలను కొనసాగించి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాలలో తరగతి గదులు పరిశీలించి, అపరిశుభ్రంగా ఉండడం చూసి సిబ్బంది తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం పరిచి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబివిపి నాయకులు తులసి దాస్, సృజన్, తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment