Home తాజా వార్తలు మలేషియాలో వేధింపులకు గురైన కామారెడ్డి జిల్లా కార్మికులకు ఎంపీ బీబీ పాటిల్ అండ

మలేషియాలో వేధింపులకు గురైన కామారెడ్డి జిల్లా కార్మికులకు ఎంపీ బీబీ పాటిల్ అండ

by V.Rajendernath

హైదరాబాద్ , ఆగస్టు 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మలేషియలో తమ యజమాని తమ పాస్ పోర్ట్ లను జప్తుచేసి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించిన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకు చెందిన 21 మంది వ్యక్తులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి.పాటిల్ ని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎంపీ.బిబి పాటిల్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసి భారత రాయబార కార్యాలయనికి సమాచారం అందించారు. మలేషియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు యజమాని నుండి పాస్ పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపిస్తాము అని తెలియజేశారు. మలేషియా బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లాకి చెందిన 21 మంది మలేషియాకి కూలీ పని చేయడం కోసం వెళ్ళారు కామారెడ్డిలో ఎవరికి వారు తెలిసిన ఏజెంట్ ద్వారా వచ్చాము ఏజెంట్లకు ఒక్కక్కరము 1,50,000/- రూపాయలు అక్షరాల ఒక లక్ష యభైవేయిల రూపాయలు ఇచ్చి మలాసియా (కంపెనీ వీసాకు) కంపెనీకి వీసా ద్వారా వచ్చాము. కానీ ఇక్కడ వచ్చాక చూస్తే కంపెనీ లేదు.ఏమిలేదు ఇక్కడ మాకు చెప్పినటువంటి కంపెనీ లేదు.మమ్మల్ని ఇక్కడ ఉన్నా ఏజెంట్ లు (పాండియన్, రామలిగం) అనే ఏజెంట్ లు మమ్మల్ని కాంట్రాక్ట్ పనికి అమ్మేసారని ఎంపీకి వివరించారు. వారిని మేము మొదట్లో లో కంపెనీ లేదు కదా ఇంకా ఎందుకు ఉండాలి మమ్మల్ని ఇండియాకు
పంపించండి అని అడిగాము.కానీ వారు మాకు కంపెనీ లేదు కానీ మీకు వేరే కంపెనీలో పనికి పెడతము మీకు నేలనెల ప్రతి నెల జీతం వస్తుంది పని చేస్కోండి అని చెప్పి చెప్పారని, కానీ వారు తీరా చూసేసారికి ఒక కాంట్రాక్టర్ కి మమ్మల్ని అమ్మేసారని, అతని ధగ్గరా అంటే కాంట్రాక్టర్ వద్ద 2 నేలల నుండీ పని చేస్తున్నాం కానీ ఎలాంటి జీతం ఇవ్వటం లేదు ఇంతవరకు మాకు ఉండటానికి సరైన గది లేదు సరైన సౌకర్యాలు లేవు తినడానికి సరైన సమయానికి అన్నము కూడా పెట్టడం లేదు. పడుకోవాడానికి దుప్పట్లు లేవు మాకు మేము మతో పాటూ తెచ్చుకున్న టవల్స్ ని కప్పుకొని పడుకుంటున్నాము. మాకు ఇక్కడ జీతం ఇవ్వట్లేదు మేము ఇక్కడ పని చేయలేము అని కామారెడ్డి లో ఉన్నా ఏజెంట్ లకి ఇక్కడ ఉన్నా ఏజెంట్ లకి చెప్పాము కాని వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఒక్కసారి ఫోన్ ఆఫ్ చేస్తున్నారు .ఒక్కక్కసారి ఫోన్ లేపడం లేదు ఫోన్ చేస్తే సరిగా స్పదిస్తాలేరు మాకు ఇక్కడ ఉన్నా బాధలు మా గొసలు ఇంత అంతా కాదు చెప్పుకోలేక పోతున్నాము చాలా ఉన్నాయని, అని మీ నుండి మాకు సహాయం కావాలి దయచేసి మమల్ని ఇక్కడ నుండి ఇండియాకు తీసుకుపోయే విధంగా చూడండి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మా స్వగ్రామానికి మమల్ని చేర్చండి దయచేసి అంటు వారి యొక్క పూర్తి వివరాలు ఎంపీ బిబి పాటిల్ సమాచారం అందించారు.
విషయం తెలియజేయగానే ఎంపీ బిబి పాటిల్ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మలేషియా ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. మలేషియాలో ఉన్న బాధితులు అయిన
పురముశెట్టి బాను (పోతారము, మాచారెడ్డి), బెస్తా సాయిలు,
గాంధారి, నునావత్ సెవ్య, నునవత్.రవి.
(నందివాడ,తాడ్వాయి), మలోత్.లాస్య.
(హాజీపుర్, లింగంపెట్), భుంపల్లీ.రమేష్.
(సోమారం తాడ్వాయి),
లతో పాటు ఇంకాకొంత మందిని ఇండియాకు త్వరగా తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. వారిని ఇండియాకు తిరిగి తీసుకురావడానికి భారత మలేషియా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో ఎంపీ బిబి పాటిల్ మాట్లాడి…
బాధితులకు ఎంపీ బిబి పాటిల్ దైర్యము చెప్పారు , మీకు నేను ఉన్నాను, భయపడకండి, కలత చెందకండి మిమల్ని ఇండియకు తీసుకువచ్చే బాధ్యత నాది అన్ని భరోసా ఇచ్చారు. ఎంపి బిబి పాటిల్ సహాయ సహకారంతో మలేషియా నుండి ఇండియాకు రానున్న మలేషియా కూలీ పనికి కోసము వెళ్ళిన బాధితులు త్వరలో ఇండియా కు రానున్నారు.

You may also like

Leave a Comment