బాసర. ఆగస్టు.24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి ముధోల్ బి ఆర్ ఎస్ టికెట్ కేటాయించారని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి బాసర అమ్మవారి క్షేత్రానికి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గురువారం రావడంతో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల ఆశీర్వాద బలంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని స్థానిక ప్రజా ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మణరావు, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రామారావు, బిఆర్ఎస్ కన్వీనర్ కొర్వా శ్యామ్,అమృత్ పటేల్,దేవేందర్,మాజీ ఎంపిటిసిలు,పోతన్న, బాలరాజ్ గౌడ్,జ్ఞాని పటేల్, మల్కన్న యాదవ్, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీ,ఫాసి,లాల్ మియా ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు.
విట్టల్ రెడ్డికి మరోసారి బిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్
57
previous post