Home తాజా వార్తలు ఎన్ డిసిసి బ్యాంకు ఉద్యోగుల సేవలు అభినందనీయం….ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఎన్ డిసిసి బ్యాంకు ఉద్యోగుల సేవలు అభినందనీయం….ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని ఎన్ డిసిసి బ్యాంకు ఉద్యోగులు సొసైటిలలో సభ్యత్వం పొందిన రైతు ఖాతాదారులకు అందించిన సేవలు అభినందనీయం అని, ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్, మత్తమాల సొసైటి ఛైర్మన్ కాసాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎన్ డిసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహించిన సురేన్, బిచ్కుంద ఎన్ డిసిసి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గా బదిలీ కాగా , క్యాషియర్ గా విధులు నిర్వహించిన ప్రణీత్ గౌడ్ నాగిరెడ్డి పేట్ ఎన్ డిసిసి బ్యాంక్ క్యాషియర్ గా బదిలీ కావడంతో వారికి వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీ పై వెళ్లిన చోట కూడా రైతు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం సురేన్, ప్రణీత్ గౌడ్ లకు శాలువా కప్పి పూలమా లలతో ఘనంగా సన్మానించి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్, మత్తమాల సొసైటి ఛైర్మన్ కాసాల శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పద్మారావు, ఎల్లారెడ్డి సొసైటి చైర్మన్ ఏగుల నర్సింలు, ఎన్ డిసీసీ బ్యాంక్ మేనేజర్ సాయులు, ఎల్లారెడ్డి, మత్తమాల, వెల్లుట్ల సొసైటి ల సి ఈ ఓ లు విశ్వనాథం, పుల్గల పెంటయ్య, పి.రాంచందర్, మలేశం, సిబ్బంది తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment