జనగామ, ఆగస్టు 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కాంగ్రెస్ పాలన స్కాములమయం అని,
అవినీతి మరకలు లేని పాలన మోదీ పాలన అని,
కెసిఆర్ డబ్బు మధ్యాన్ని నమ్ముకున్నారని
బీజేపీ నేత ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ “పోలింగ్ బూత్ మేళా” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మనిషికి వెలగడుతున్నారు.
కానీ తెలంగాణ ప్రజలు ఆకలితో అయిన ఉంటారు కానీ ఆత్మగౌరవం చంపుకొరు. కెసిఆర్ ఇస్తున్న డబ్బులు మనవే తీసుకోండి. ఓటు మాత్రం ధర్మానికి వేయండన్నారు.
దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజల డబ్బులతో దావతులు చేయించారు.
నీ అబ్బ జాగీరా కెసిఆర్ అని ప్రశ్నించారు. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుభీమా అన్నీ కలిపిన కెసిఆర్ మనకు ఇచ్చేది 25 వేల కోట్లుదాటవు కానీ వాడ వాడకు బెల్ట్ షాపు పెట్టీ మరే 45 వేలకోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు.
నొప్పిలేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కుతి లేస్తే అర్ధరాత్రి కూడా బ్రాందీ సీసా దొరుకుతుందన్నారు.
విశ్వనగరం అని చెప్తున్న హైదరాబాద్ లో జరుగుతున్న దారుణాలు మనల్ని తలదించుకునేలా చేస్తున్నాయన్నారు.
యువకులు గంజాయికి బానిస అవుతున్నారు.
వాటిని అరికట్టాల్సిన విషయం కేసీఆర్ కు పట్టదన్నారు.
కాంగ్రెస్ కి ఓటు వేసినా, బీఆర్ ఎస్ కి ఓటు వేసిన కెసిఆర్ సీఎం అవుతారన్నారు. బరిగీసి కొట్లడేది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే..
డబుల్ బెడ్ రూం ఇల్లు అర్హులందరికీ ఇస్తాం.
ముసలాయన, ముసలావిడ ఇద్దరికీ పెన్షన్ అందిస్తాం.
కన్నీళ్లు లేని కష్టాలు లేని తెలంగాణ తీసుకువస్తాం.
ఘనపూర్ నియోజకవర్గం లో కూడా అవకాశం ఇస్తే పెద్ద నాయకులు అవుతారన్నారు.
గతంలో ఇదే నియోజకవర్గం లో గొప్ప నాయకుడు అనుకున్న అతనని ఆరోజు మట్టి కరిపించారని,
కేసీర్ చెప్పిందే చేయాలి తప్ప ఎదురించే ధైర్యం ఎవరికీ లేదన్నారు. గతంలో పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని కమిటీ నిర్ణయిస్తే, దానికి విరుద్ధంగా డబుల్ బెడ్ రూములు కట్టిస్తా అన్నాడు. మాటలకు చేతలకు సంబంధం లేని వ్యక్తి కెసిఆర్. అటుకులు బుక్కీ ఉద్యమం చేసిన అన్న కెసిఆర్,
ఈరోజు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ?
6 నెలల కాలంలో హుజురాబాద్ లో 6 వేల రూపాయలు అందరికి, దళిత బందు డబ్బులు అందరికి ఇచ్చినా కూడా పైసలు ఇవ్వని బీజేపీ ని గెలిపించారన్నారు.
తన పార్టీ అకౌంట్ లో 850 కోట్లు ఉన్నాయని చెప్పాడు, అవి ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.
దేశం లో అన్ని పార్టీ లకు నన్ను నాయకునిగా చేయండి, మీకు ఖర్చు పెడతా అన్నాడు. దీని మీద చర్చ జరగాలన్నారు.
దళిత ముఖ్యమంత్రి దేవుడు ఎరుగు..17 శాతం ఉన్న దళితులలో 11 శాతం ఉన్న మాదిగలకు ఎన్ని పదవులు ఇచ్చారు ?
ఒక్క శాతం ఉన్న కులానికి ఎన్ని పదవులు ఉన్నాయి, 17 శాతం దళితులకు ఎన్ని పదవులు వచ్చాయి.11 శాతం ఉన్న మాదిగ బిడ్డలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వని కేసీర్ ను బొంద పెట్టాలన్నారు.
ఒక వేల బి ఆర్ ఎస్ దేశమంతా గెలిచిన అయితే కేసీర్ కాకుంటే.
కేటీఆర్, కాకుంటే కవిత అధికారంలోకి వస్తారు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వరు.
కానీ బీజేపీలో చాయి అమ్మిన వ్యక్తికి పదవులు ఉంటాయి.
మన మోడీ ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్లినా కూడా గౌరవిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పాలన స్కాములమయం.అవినీతి మరకలు లేని మోదీ పాలనకెసిఆర్ డబ్బు మధ్యాన్ని నమ్ముకున్నారు.బీజేపీ నేత ఎమ్యెల్యే ఈటెల రాజేందర్
46