నిజాంసాగర్ ఆగస్టు 11,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే ,ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్ దపేదర్ రాజు లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం భవనంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో నాగేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి ,వైస్ ఎంపీపీ మనోహర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైనివిఠల్, సిడిసి చైర్మన్ గంగారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, ఎంపీటీసీ బాలమణి, నాయకులు యాటకారి నారాయణ, చాకలి రమేష్ కుమార్, పిట్ల సత్యనారాయణ, సర్పంచ్ లు కమ్మరి కత్త అంజయ్య, నారాయణ, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.