రాహుల్ జవారే AISB రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 24/01/24
భైంసా మండలం కేంద్రం లో ని
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23నీ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ AISB రాష్ట్ర అధ్యక్షులు జవారే రాహుల్ డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా భైంసా వశిష్ట జూనియర్ కళాశాలలో నీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వెంటనే నేతాజీ జయంతిని అధికారిక లాంచనాలతో నిర్వహించడంతోపాటు, జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తామని, అంతేకాకుండా ఆయన మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను బయటకు తీసుకొస్తామని, ఆయన చేసిన పోరాటాన్ని నేటి యువతకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్ర పొందుపరుస్తామని హామీ ఇచ్చి నేటికి 10యేళ్ల గడిచిపోతున్న ఏ ఒక్క హామీని కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. నిష్కలంక దేశభక్తుడైన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల నేటి యువతకు, ప్రజలకు ఏమాత్రం గౌరవం తగ్గలేదని ప్రభుత్వాలు స్పందించకున్న యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నేటికీ ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాయని ఆయన కొనియాడారు. ఇప్పటికైనా కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన జయంతి అయిన జనవరి 23న జాతీయ సెలవు దినంగా ప్రకటించడంతోపాటు అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వశిష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ ధర్మపురి లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి
52
previous post