Home తాజా వార్తలు నేతాజీ జయంతి ఉత్సవములు

నేతాజీ జయంతి ఉత్సవములు

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ జనవరి 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్: స్థానిక హౌసింగ్ బోర్డు నేతాజీ మెమోరియల్ హైయ్ స్కూల్ ఆద్వర్యంలో గాంధీ నగర్ లో గల నేతాజీ శిలా విగ్రహం వద్దకు చిన్నారులందరు నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు గా చేరుకున్నారు. శిలా విగ్రహానికి నేతాజీ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ పతి శ్రీనివాస్ పూల మాల వేసి నివాళులర్పించారు ఆ సందర్భంగా నేతాజీ జీవిత చరిత్ర పై ఉపన్యాస, వ్వాస రచన పోటీలు నిర్వహించారు.గెలుపొందిన చిన్నారులకు యం.ఈ.వొ. బాలాజీ సార్ చే గణతంత్ర దినోత్సవం రోజు బహుమతి ప్రదానం జరుగుతుందని పాఠశాల నిర్వాహకులు శ్రీ పతి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యం.యల్. ఏ బి.ల్.ఆర్, స్థానిక కౌన్సిలర్ కొమ్ము శ్రీను, మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి,
హెచ్ యం బీమ్ల, టీచర్స్ నూరి, అలివేలు, సునీత, కల్యాణి, జబీన్, శిరిష, వెంకన్న, శోభ, సత్యం పాల్గొన్నారు.

You may also like

Leave a Comment