Home తాజా వార్తలు హుజూర్‌నగర్ నియోజకవర్గం తండాలో గుప్పుమంటున్న నాటు సారా

హుజూర్‌నగర్ నియోజకవర్గం తండాలో గుప్పుమంటున్న నాటు సారా

by Telangana Express

హుజూర్‌నగర్ ఏప్రిల్ 02 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ )
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈరోజు
ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా సారా నిర్మూలన కై ప్రత్యేక డ్రైవ్ ని చేయాలని ఆదేశాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాఎక్సయిజ్ అధికారి శ్రీ లక్ష్మ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు హుజూర్‌నగర్ లోని మట్టంపల్లి,చింతలపాలెం, మెల్లచెర్వు మండలాలలో పలు గ్రామాల్లో

నల్గొండ ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్, సూర్యాపేట డి.టి.ఎఫ్ ,కోదాడ స్టేషన్ తో పాటు హుజుర్నగర్ ఎక్సయిజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల లో 23 లీటర్ల సారా తో పాటు 300 కిలోల బెల్లం ను స్వాధీనం చేసుకోవడమైనది.ఒక వాహనం ను సీజ్ చేయడమైనది.

ఇట్టి కేస్ లలో ఎర్రకుంట తండా కు చెందిన బానోతు శ్రీను ల నుండి 5 లీటర్లు,బాణోత్ హనుమ నుండి 3 లీటర్లు ,సారా స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడమైనది.

చింతలపాలెం మండల కేంద్రంలో ఒక ఇంట్లో దాచిన 300 కిలో ల బెల్లం ను సీజ్ చేయడమైనది. ఆ ఇంటి వ్యక్తి పరారీ లో వున్నాడు.

అదే గ్రామానికి చెందిన చిత్తలూరి లక్మి సారా విక్రయిస్తుండగా ఆమె వద్ద నుండి 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడమైనది.ఆమె పై కేస్ నమోదు చేయడమైనది.

మట్టంపల్లి మండలంలో అవిరేణి కుంట తండా,సుల్తానాపూర్ తండా,రామచంద్ర పురం తండా శివార్లలో దాచి ఉంచిన సుమారు 900 లీటర్ల బెల్లం పానకం ను ధ్వంసం చేయడమైనది.

ఇట్టి దాడుల లో జిల్లా ఎక్సయిజ్ అధికారి శ్రీ లక్ష్మ నాయక్ తో పాటు, c.i లు రాకేష్, మల్లయ్య, శంకర్ ల తో పాటు s.i లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment