ఉట్కూర్ జులై 26 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నారాయణపేట జిల్లాలో గత రోజుల నుండి వర్షాలు పోవడంతో వాతావరణ శాఖ అధికారులు నారాయణపేట జిల్లా ఆరెంజ్ అలర్ట్ చేయడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసినందున అన్ని విభాగాల అధికారులు జిల్లాలోనే ఉండాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష ఆదేశించారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధిక వర్షాలు కురిసే గ్రామా లలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామ సర్పంచులు వీఆర్ఏలు తగిన ఏర్పాట్లు చేసే విధంగా అధికారులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నారాయణపేట జిల్లాలోని ప్రజలు అవసరాలు ఉంటే తప్ప బయటకు రావాలని లేదంటే ఇండ్లలోనే ఉండాలని లేదంటే సురక్షిత ప్రాంతాల్లో వెళ్లిపోవాలని ఆయన సూచించారు . నారాయణపేట జిల్లా ఆరెంజ్ అలెర్ట్ కావడంతో అధికారులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని కలెక్టర్ అన్ని రంగాల శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో బుధవారం రాత్రి నుండి 48 గంటల పాటు అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారుల తమ తమ గ్రామాల్లో ఉండి పర్యవేక్షణ చేయాలని గ్రామాల్లో పురాతన శిబిరాల భవనాలు గోడలు కులే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని వెంటనే గుర్తించి నిరాశకులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ మయాంక్ విత్తల్ ,మున్సిపల్ కమిషనర్ సునీత, విద్యుత్ అధికారి ప్రభాకర్ వేముల, నీటిపారుదల శాఖ అధికారి చక్రధరం ఆ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ కొయ హర్ష.
70
previous post