మిర్యాలగూడ మే 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ కోరారు.

ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని 11వ వార్డు నందిపాడు
వార్డు అధ్యక్షులు పాలారపు సత్యనారాయణ అధ్యక్షతన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక టి.ఎన్.ఆర్ గార్డెన్స్ లో జరిగింది.

ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, శ్రేణులు, ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి కృష్ణారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నాగార్జున చారి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్,11 వాడు కోఆర్డినేటర్ యడవల్లి శ్రీనివాస్ రెడ్డి,ఈ కార్యక్రమంలో నాగరత్నం, గోవర్ధన్ రెడ్డి, డోనాటి ఆశలు, జాజుల రవి, నాగయ్య, రినయ్య, రవీందర్, రవి, వార్డ్ ముఖ్య నాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.