బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్మిర్యాలగూడ డివిజన్ మార్చి 6 తెలంగాణ ఎక్స్ప్రెస్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంటును బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నల్గొండ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది బీసీలు కాబట్టి ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూడకుండా జనాభా ధమాస ప్రకారం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అన్నారు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా బీసీ ఓట్లే ఉన్నందున ప్రతి రాజకీయ పార్టీ నల్గొండ పార్లమెంటును బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటులో 8 పార్లమెంటు స్థానాలు బీసీలకే కేటాయించాలని ఆయన కోరారు బీసీలు ప్రతి రాజకీయ పార్టీకి వెన్నుదండగా ఉంటూ పార్టీల జెండాలు మోస్తూ జిందాబాద్ కొడుతున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను గుర్తించి సముచిత స్థానం కల్పించడం లేదని ఆయన అన్నారు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు రాజకీయ పార్టీలు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎన్ని పార్లమెంట్లో కేటాయిస్తారు తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ల పొడి శ్రీనివాస్, రాయించు నరసింహ, చిలకల మురళి యాదవ్, పగిళ్ల అనిల్ కుమార్, నరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
నల్గొండ పార్లమెంటును బీసీలకు కేటాయించాలి
44
previous post