ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పతంగి పోటీలు
మంచిర్యాల, జనవరి 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జన్నారం మండలం పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధి రాంనగర్ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సోమవారం సంక్రాంతి పండగ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా 5వ మహిళ సంఘం అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ ఆధ్వర్యంలో రాంనగర్ కాలనీలో ముగ్గుల పోటీలు జరిగాయి. జన్నారం మండలం లోనీ రాంనగర్ కాలనీలోని ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో దాదాపు 120మంది మహిళలు పాల్గొన్నారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన మహిళలు వేరువేరు రంగు రంగుల కలరుతో ముగ్గులు వేసి అందరినీ అలరించారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరీక్షించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ బహుమతులను జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సమక్షంలో జన్నారం మండల జడ్పిటిసి చంద్రశేఖర్ కొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ చేతుల మీదుగా ముగ్గులలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ, జిల్లా మండల గ్రామాలలో ఉండే పేద ప్రజలు, రోడ్డుపై ఉండే ఎవరూ లేని అమాయకుల ఆకలి బాధ తీర్చే విధంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. పొనకల్ సర్పంచ్ జక్కు భూమేష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం గ్రామంలోని ప్రజలు, యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అ ముగ్గుల పోటీలలో భాగంగా ఆదర్శ కళా కళాకారులు రెలా రే రేల, సింగర్ శిరీష పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి చిలువేరి నీరోషా సుధీర్, ద్వితీయ బహుమతి తిరుమల, తృతీయ బహుమతి సురనేని వనిత, మిగితా వారికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా జాజాల శ్రీనివాస్ వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి హరిణి మధుసూధన్ రావు, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్, ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయ, లింగంపల్లి రాజలింగం, పర్ల కనకయ్య, కనికారపు అశోక్, గుడ్ల రాజన్న, గంగాధర్, తదితరులు ఉన్నారు. అదేవిధంగా పట్టణ కేంద్రంలో పతంగి పోటీలు రాష్ట్ర కార్యదర్శి సోహెల్ షా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పతంగులు ఎగురవేయడం జరిగింది. పతంగి ఎగురవేసే పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర కార్యదర్శి సమక్షంలో బహుమతులను అందజేశారు. పతంగి పోటీలలో జన్నారం మండల యూత్ సభ్యులు మొదటి బహుమతి గెలుపొందారు. రెండవ బహుమతి పొనకల్ గ్రామానికి చెందిన పవన్ పోటీపడి గెలుపొందారు. పతంగి పోటీలలో పాల్గొని గెలుపొందిన వారిని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్ మండల సీనియర్ నాయకులు పసివుల్లా బహుమతులు గెలుపొందిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి నాయక్, రఘు, అజ్మత్, గణేష్, తరుణ్, బన్నీ, నాగరాజు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.