తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ డిసెంబర్ 13
. ముదిరాజ్ సంఘాలు తమ లక్ష్యాలను
. పునర్ నిర్దేశించుకోవాలి
గత రెండు దశాబ్దాలుగా ముదిరాజ్ సమాజం ఎన్నో సంఘాలుగా విడిపోయినా కూడ, ఇట్టి సంఘాలు, ఈ సంఘాల నాయకులు జాతి పట్ల ప్రేమతో, జాతి పేదల పట్ల మమకారంతో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ, తమ భవిష్యత్తును పణంగా పెట్టి జాతి శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు. ఈ విషయంలో అన్ని సంఘాల నాయకులు పూజనీయులు మరియు వారి సేవలు ప్రశంసనీయమైనవి.
కానీ,.. గత రెండు దశాబ్దాల కాలంగా ఈ సంఘాల వల్ల జాతి స్థితిగతు లలో ఎలాంటి ముందడుగు లేకపోవడం కడు శోచనీయమే కాకుండా సమీక్షించు కోవలసిన అంశంగా పరిణమించింది.
అన్ని ముదిరాజ్ సంఘాలకు, ఈ సంఘాల నాయకులకు…..
జెండాలు ఉన్నాయి- అజెండా లేదు.
ఆకర్షణీయ కండువాలు ఉన్నాయి-
అనుసరణీయ కార్యాచరణ లేదు.
మంచి మనసు ఉంది-గమ్యం చేరే మార్గం లేదు.
చిత్తశుద్ధి ఉంది- లక్ష్యశుద్ధి లేదు.
అందువలన అన్ని ముదిరాజ్ సంఘాలు తమ లక్ష్యాలను పునర్ నిర్దేశించు కోవలసిన ఆవశ్యకతను గుర్తించాలి అన్నారు.