Home తాజా వార్తలు ముధోల్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం– ఘనంగా 28వ వార్షికోత్సవ సంబరాలు

ముధోల్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం– ఘనంగా 28వ వార్షికోత్సవ సంబరాలు

by Telangana Express

ముథోల్:20డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ముధోల్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘమని మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ అన్నా రు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమై న ముధోల్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి 28వ వార్షికోత్సవ కార్యక్రమం లో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడు తూ మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మెరుకైన వైద్య సేవలను అందించిన ఘనత ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి దన్నారు.ఎల్వీ ప్రసాద్ ద్వారా బ్రెయిలీ లిపి పద్దతిలో చదివి ఉద్యోగాలు సా ధించిన వారికి మాజీ ఎమ్మెల్యే శాలు వాతో సన్మానించారు. ఎల్వీ ప్రసాద్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ముధోల్ ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రికి మంచి పేరు ఉందని కొనియాడారు.అంధులకు బాసటగా నిలుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపడం సంతోషకరమని పేర్కొన్నారు. మరింత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ నిచ్చారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను అందించారు. అంతకు ముందు కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పర్యవేక్షకులు నరేష్, ముథోల్ ఆసుపత్రి పర్యవేక్షకులు సందీప్ రావు, వైద్యులు రోహన్, మదన్, శ్రావ్య రెడ్డి, ప్రణీత సతరసి, కంటి ఆసుపత్రి సిబ్బంది నాయకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment