లోకేశ్వరం డిసెంబర్ 20
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఆన్లైన్ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో రమేష్,అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు అర్హులైన లబ్దాలకు ఇంద్రమ్మ ఇల్లు అందించేందుకు అధికారులు సమయంతో కృషి చేయాలని సూచించారు. దరఖాస్దారుల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అబకంటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
