Home తాజా వార్తలు వీణవంక గ్రామ స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీడీవో శ్రీనివాస్

వీణవంక గ్రామ స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీడీవో శ్రీనివాస్

by Telangana Express

శుభాకాంక్షలు తెలుపుతూ, సన్మానించిన పాలకవర్గం

వీణవంక, ఫిబ్రవరి 2( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియడంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెరలేపింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, జిల్లా అధికారుల సమన్వయంతో మండల పరిధిలోని విధులు నిర్వహించే గెజిటెడ్ అధికారులను గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. వీణవంక మండలంలోని 26 గ్రామాలకు 13 మంది గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు మాత్రమే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు లు గా నియమించబడ్డారు. అందులో భాగంగానే మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.ఆయనను మాజీ సర్పంచులు ఎంపిటిసిలు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు సన్మానించారు.

You may also like

Leave a Comment