సిఐ
పెద్ద కొడఫ్గల్ ఫిబ్రవరి (తెలంగాణ ఎక్స్ ప్రెస్):-మండలంలోని జాతీయ రహదారి 161 పోచారం గేట్ వద్ద గత ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బిచ్కుంద సీఐ నరేష్, ఎంపీడీవో రాణి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక ఎస్సై కోనారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, సిబ్బందిలకు ప్రమాదాలు నివారణకు అరికట్టేందుకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ కోనారెడ్డి, ఇన్సిడెంట్ మేనేజర్ సౌరబ్ ప్రతాప్, పోలీస్ సిబ్బంది లు, హైవే సిబ్బంది లు పాల్గొన్నారు.
