Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో ఘనంగా మౌని అమావాస్య పూజలు,పెద్ద చెరువు కట్ట శివాలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం,ప్రత్యేక భజన కార్యక్రమం

ఎల్లారెడ్డి లో ఘనంగా మౌని అమావాస్య పూజలు,పెద్ద చెరువు కట్ట శివాలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం,ప్రత్యేక భజన కార్యక్రమం

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 9,(తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో, శుక్రవారం మాఘమ (మౌని) అమావాస్యను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఉదయాన్నే సమీప జలాశయాలకు వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించారు. మరికొందరు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సమీపంలో గల నల్లమడుగులో పుణ్య స్నానాలు ఆచరించారు. ఎల్లారెడ్డి పట్టణ శివారులోని పెద్ద చెరువులో సైతం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడే గల ఈశ్వరాలయం వద్ద ఆలయ పూజారి పెద్ద సంగప్ప అధ్వర్యంలో ప్రతి సారి మాదిరిగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈశ్వరాలయంలో స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర బిల్వార్చన, జపానుష్టానం, మంత్ర పుష్పం, మహానైవేద్యం , మంగళహారతి ఇచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు. మరో వైపు భజన బృందం భక్తి పారవశ్యంతో శివుని పాటలు పాడటంతో, ఆ ప్రాంతమంతా శివనామ స్మరణతో మార్మోగింది. ముందుగా శివ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన తదుపరి, భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు, భారీ సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్ర సాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పెద్ద సంగప్ప, నడిపి సంగప్ప, ఈశ్వరప్ప, నీలకంఠం అప్ప, శివకుమార్ అప్ప, వీరశైవ లింగాయత్ మండల అధ్యక్షులు ముత్తి వీరప్ప, ముత్తి రామప్ప, హన్మంతప్ప, భక్తులు, శివ స్వాములు , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment