మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి.
వీణవంక, జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
తెలంగాణ మోడల్ స్కూల్ ఘన్ముక్ల , వీణవంక లో 2024- 25 వ సంవత్సరానికి 6 వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2024, 6 వ తరగతి తో పాటు 7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని, దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ తెలంగాణమ్స్. సి జి జి. జి ఓ వి. ఇన్ లో స్థానిక మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకొనవచ్చునని,పరీక్ష ఫీజు వివరాలు ఓసి విద్యార్థులకు 200 రూపాయలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి , ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 125 రూపాయలు. 6 వ తరగతి విద్యార్థులకు పరీక్ష 07 ఏప్రిల్ 2024 రోజున ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు, 7 నుండి 10 వ తరగతి విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 02 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించబడునని,మిగిలిన వివరాలు సంబంధిత వెబ్సైట్ లో చూడగలరని, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటన తెలియజేశారు.