మిర్యాలగూడ డిసెంబర్ 26 : (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ శాసన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ గురువారం ఉదయం 5గంటల సమయంలో మృతి చెందడం జరిగింది.అల్గుబెల్లి భాగమ్మ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వగ్రామమైననల్లగొండ జిల్లా,మాడ్గులపల్లి మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చర్లగూడెం లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, సెయింట్ జాన్స్,శిష్య విద్యాసంస్థల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
