జుక్కల్ డిసెంబర్ 23 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఆసుపత్రి సిబ్బంది రోగులకు శక్తిమేరకు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే ఒక ఇన్చార్జి డాక్టర్ ఉన్నాడని ఎమ్మెల్యేకు తెలిపారు.మారుమూల ప్రాంతమైన కొడప్ గల్ ఆసుపత్రిలో ఖాళీ పోస్టు లన్నీ భర్తీ చేయాలని కోరారు.ఒక బోర్ వేయాలని ,ప్రహారి గోడను నిర్మించాలని ఎమ్మెల్యే ను కోరారు.అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఉమాకాంత్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి , మల్లప్ప పటేల్,అహ్మద్, మొగులాగౌడ్,డాక్టర్ సంజీవ్,సంతోష్ ,బస్వ రాజ్ దేశాయ్,నాగ్ నాథ్ పటేల్,జిన్నా రాములు,శంకర్,రషీద్, పండరి, బాల్ రాజు ,మష్ణు ,మారుతి, జోగొర్ నాయక్ చాంద్,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
