Home తాజా వార్తలు దత్త జయంతి వేడుకలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పిఎస్అర్

దత్త జయంతి వేడుకలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పిఎస్అర్

by Telangana Express

మంచిర్యాల, డిసెంబర్ 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): దత్త జయంతి వేడుకలలో భాగంగా మంచిర్యాల జిల్లా పట్టణంలో వేద పండితుల ఆధ్వర్యంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం శోభకృత నామ సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీ హమాలీ వాడలోని సాయిబాబా ఆలయంలో పిఎస్ఆర్ పూజలు జరిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దత్త జయంతి వేడుకలలో పాల్గొని స్వామివారి కృప కటాక్షమును పొందడం జరిగిందన్నారు. దత్త జయంతి పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం, దీపారాధన అలంకరణ, భక్తులకు దర్శనము, హోమ కార్యక్రమములు, హారతి తీర్థ ప్రసాద వితరణ, ఇతర పూజలు వేద పండితులు జరిపించగా భక్తుల సమక్షంలో ఎమ్మెల్యే పీఎస్ఆర్ పాల్గొన్నారు. సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment