వీణవంక, ఫిబ్రవరి 22 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క- సారలమ్మలకు ఎత్తు బంగారం ( బెల్లం) మొక్కు సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామమైన వీణవంక గ్రామంలో గురువారం కుటుంబ సమేతంగా కలిసి ఎత్తు బంగారాన్ని సమ్మక్క- సారలమ్మలకు మొక్కు సమర్పించుకోగా, ఎత్తు బంగారం సమర్పణలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో పాటుగా, ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి, సోదరుడు కార్తీక్ రెడ్డి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, జడ్పిటిసి వనమాల సాధవ రెడ్డి,మాజీ సర్పంచులు కుమారస్వామి, నరసయ్య, మాజీ ఉపసర్పంచ్ భానుచందర్, బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి మహేందర్,మధు తదితరులు పాల్గొన్నారు.