Home తాజా వార్తలు రైతులకు అండగా ఎమ్మెల్యే మందుల

రైతులకు అండగా ఎమ్మెల్యే మందుల

by Telangana Express

* కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్

తుంగతుర్తి, డిసెంబర్ 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

రైతులకు అన్ని రకాలుగా మన ఎమ్మెల్యే మందుల సామెల్ అండగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సాయం చెరువు కింద సుమారు 60 నుండి 70 ఎకరాలు సాగు ఉండగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నల కష్టాలు చూసి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మిట్టగడుపుల అనూఖ్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు మండల సామెల్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి స్వతాగ రైతు అయిన ఎమ్మెల్యే రూ.2.50 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్ ను ఈ మేరకు శనివారం పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటుచేసిన సందర్భంగా దొంగరి గోవర్ధన్ మాట్లాడుతూ… పేద,బీద, సన్న చిన్న కారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కు తెలియపరచడంతో తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించినందుకు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నాణ్యమైన విద్యుత్, ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ శాఖ అధికారులు సేవలు అందించాలని తెలిపారు.

You may also like

Leave a Comment