బిచ్కుంద ఆగస్టు 2:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్చుకుందా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెండు 108 అంబులెన్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే హన్మంత్ సిందే మరియు 108 అంబులెన్స్ ముందు కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే హన్మంత్ సిందే ,108 సిబ్బందితో కలిసి పాలాభిషేకం చేసినారు.
అనంతరం ఆసుపత్రిలో తిరుగుతూ డయాగ్నాలజిస్ట్ సెంటర్లో చికిత్స పొందుతున్న పేషంట్లను మాట్లాడి వారి యొక్క సమస్యను తెలుసుకున్నారు అనంతరము ఏర్పాటు చేసిన వేదిక నుండి ఎమ్మెల్యే సిందే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు వైద్య విద్య ఆరోగ్య విషయంలో ముందంజలో ఉందని తెలిపారు.
నియోజకవర్గం లో ఏడు మండలాల్లో ప్రస్తుతం 3 108 అంబులెన్స్ అందుబాటులో వచ్చినాయి అని మళ్లీ నాలుగు అంబులెన్స్ కావాలని పై అధికారులకు తెలియజేస్తే పాత మండలాల ప్రకారము ఇంకా రెండు 108 అంబులెన్స్ త్వరలో అందుబాటులో వస్తాయని తెలియజేశారు.
బిచ్కుంద మండల ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ కెసిఆర్ చేతుల మీదుగా బిచ్కుందలో 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రికి అవుతుందని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారని త్వరలో 100 పడకల ఆసుపత్రిని సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
వీరితోపాటు, వైద్యుడు కుల్దీప్, వైద్య సిబ్బంది దస్థిరామ్,108 సిబ్బంది ,బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ ,జుక్కల్ ఎంపీపీ యశోద నీళ్లు పటేల్, బిచ్కుంద మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, జుక్కల్ మండల్ అధ్యక్షులు మాధవ దేశాయ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ ,జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, రైతుబంధు అధ్యక్షులు బసవరాజ్ పటేల్, మద్నూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ , స్థానిక ఎంపీటీసీ చంద్రకళ రాజు ,టిఆర్ఎస్ నాయకులు బొమ్మల లక్ష్మణ్ ,నాల్చారి శ్రీనివాస్ ,శంకర్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు,