ఎల్లారెడ్డి, అక్టోబర్ 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్యే అభ్యర్థి బుక్య జాక్సన్ నాయక్ హాజరయ్యారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో భాగంగా చివరి రోజున స్థానిక ఆడపడుచుల మధ్యలో స్విచ్ బుడ్డి వెలిగించి, బతుకమ్మ ఆటా పాటా లను సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు, గ్రామంలో మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాక్సన్ ఆధ్వర్యంలో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతిలో లభ్యమయ్యే తంగేడు, కమలం, బంతి, చామంతి పూలతో భారీ పొడవైన బతుకమ్మలను సుందరంగా స్థానిక సర్పంచ్ జక్కు భూమేష్ సమక్షంలో ఎలక్ట్రానిక్ బలుపులతో తయారు చేసి, గ్రామాల కూడళ్లలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ పాటలతో మహిళలందరు ఆటలు ఆడారు. ఎంపీపీ మా దాడి సరోజన, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుశీల, మండల మహిళా సర్పంచులు గ్రామాల్లో మహిళలతో కలిసి బతుకమ్మల ఆటలు ఆడారు. గ్రామాల్లో మహిళలతో కలిసి బతుకమ్మల ఆటలు ఆడి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను సమీపంలో వాగులో మహిళలు నిమజ్జనం చేశారు. బతుకమ్మ చివరి రోజున మహిళలు వెంట తీసుకు వచ్చిన తినుబండారాలు ఒకరిది ఒకరు కలిసి ఆరగించి, బతుకమ్మ తల్లిని పాటల పాడుతూ మహిళలు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్, జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఎఎంసి వైస్ చైర్మన్ గోట్ల రాజేష్ యాదవ్ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, జన్నారం ఎంపీటీసీ రియాజోద్దీన్, మాదాడి రవీందర్, భరత్ కుమార్, శెట్టిపల్లి సత్యం, కేఏ నరసింహులు, రాగుల శంకర్, మున్వర్ అలీ ఖాన్, తాళ్లపెళ్లి రాజేశ్వర్, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.

