మిర్యాలగూడ జనవరి 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ కళాశాల గ్రౌండ్ కు గేటు లేని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా తన సొంత ఖర్చులతో 10 లక్షల వ్యయంతో కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారన్నారు. వాకర్స్ కు ఏ సమస్య రాకుండా అన్ని తానే సహాయ సహకారాలు అందించారని బిఎల్ఆర్ సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కార్యవర్గం, ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు సన్మానం
82
previous post