Home తాజా వార్తలు వర్షిత హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

వర్షిత హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

by Telangana Express


👉 ఐదువేల నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు అందజేస్తాం: కర్నాటి రమేష్
👉 లయన్స్ సేవలు గ్రామీణ ప్రాంతాలలో విస్తరించాలి :

మిర్యాలగూడ, జనవరి 19 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటుచేసి లయన్స్ క్లబ్ సేవలు అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. శుక్రవారం
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్, హెచ్.పీ గ్యాస్ కార్యాలయం సమీపంలో గల వర్షిత హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ఆధ్వర్యంలో “వర్షిత” సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కూటాల రాంబాబుల నేతృత్వంలో ఏర్పాటుచేసిన మేగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్నాటి రమేష్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లయన్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా సేవలను అందిస్తామని, ఐదువేల నోటు పుస్తకాలను ఎమ్మెల్యే బిఎల్ ఆర్ కు అందజేస్తామని ప్రకటించారు.

మరింత ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. వర్షిత హాస్పిటల్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చైర్మన్ కూటాల రాంబాబు తెలిపారు.
హైదరాబాద్ యశోద హాస్పిటల్ మలక్ పేట్ చెందిన ప్రముఖ డాక్టర్లు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రమాకాంత్ రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణుడు డాక్టర్ అమన్ చంద్రపాండే, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్. రోహిత్ రెడ్డి,డాక్టర్ నివాళికలు మేగా వైద్య శిబిరంలో హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ కే ఎన్ ప్రసాద్, మాజీ జోనల్ చైర్మన్లు ముక్కా పాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ జాడీ రాజు, రవీందర్ రెడ్డి, లైన్స్ క్లబ్ కార్యదర్శి లింగయ్య, అనంత రెడ్డి, కృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ సిజెఎస్ఎస్ దివ్యాంగ చైతన్య అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, బి. ఎం. నాయుడు, లైన్స్ క్లబ్ తరుణ కార్యదర్శి సామా శ్రీనివాస్, గుండా రాంబాబు, ఏచూరి మురారి, భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు మేకల శ్రీనివాస్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కౌన్సిలర్లు జానీ, జావిద్, రుణాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్, లయన్స్ లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment