విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే…
ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు ఘన స్వాగతం పలికిన కైరళి పాఠశాల యాజమాన్యం…
మిర్యాలగూడ డివిజన్ జనవరి 29 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ లోగల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్రీడల పోటీల విజేతలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ బహుమతులను అందజేశారు.

ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం వరంగల్ కి చెందిన సామాజికవేత్త శంకర్ యు బ్లడ్ యాప్ బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. కైరళి విద్యాసంస్థల చైర్మన్ మహమ్మద్ అహ్మద్, వరలక్ష్మీ, జనయెత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్, కౌన్సిలర్ ఫర్జాన మాయిజ్ తదితరులు పాల్గొన్నారు. కైరళి పాఠశాల యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులు, ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు ఘనస్వాగతం పలికారు
