మిర్యాలగూడ డిసెంబర్ 16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం 6 గంటలకు కేరళ సాంప్రదాయ వాయిద్యములతో స్వాముల
భగవన్నామస్మరణలతో
ఊరేగింపుగా మిర్యాలగూడ పట్టణం అశోక్ నగర్ లోగల గుడిపాటి నవీన్ ఇంటి వద్ద నుండి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం వరకు కలశం ప్రదర్శన నిర్వహించగా మండల పూజ ఉత్సవంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, స్వాములతో కలిసి కలుషం ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుండి స్వాములచే దీపారాధన నవాభిషేకములు, అష్టాదన సోపాన ( 18 మెట్ల పూజ) నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగములు, మండల పూజ మహోత్సవములు ఆలయ ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ పీసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి వేద స్పర్చ జోతిష ఆగమ వాస్తు మంత్ర శాస్త్ర ప్రావీణ ఆధ్వర్యంలో గురు స్వాముల సహాయ సహకారంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం శాశ్వత చైర్మన్ కమిటీ సభ్యులు ముక్క పాటి వెంకటేశ్వరరావు, దేశిడి శేఖర్ రెడ్డి, రవి నాయక్, గోదాటి జానకిరామ్ రెడ్డి, రాజేందర్ (కిరణం), నాగేంద్ర, పెద్ద సంఖ్యలో స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

