Home తాజా వార్తలు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ మాతృమూర్తి వెంకట్రావమ్మ మృతి

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ మాతృమూర్తి వెంకట్రావమ్మ మృతి

by Telangana Express


ప్రచారం నుండి హుటాహుటిన ఇంటికి వెళ్లిన బిఎల్ఆర్
మిర్యాలగూడ, నవంబర్ 26, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మిర్యాలగూడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి బత్తుల వెంకట్రావమ్మ (77)అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందారు.

పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పట్టణంలో ముమ్మర ప్రచారంలో ఉన్న బిఎల్ఆర్ తల్లి మరణ వార్త తెలుసుకొని ప్రచారం నుండి హుటాహుటిన ఇంటికి వెళ్లిపోయారు. తల్లి మృతదేహం వద్ద బిఎల్ఆర్ విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బిఎల్ఆర్ మాతృమూర్తి మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బి ఎల్ ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని వెంకట్రావమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. బిఎల్ఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

You may also like

Leave a Comment