జోగిపేట నవంబర్ 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం లో చేపట్టనున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష సింగూర్ డ్యాం బ్యూటీ పికేషన్ ఐలాండ్ డెవలప్మెంట్ కల్చర్ (సోలాపూర్) గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను మంత్రి పరిశీలించారు, ఆందోల్, సంగారెడ్డి, ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పర్యటక ప్రాంతాలు ఉండాలన్నారు, ఆందోల్ చెరువును బ్యూటీ పికేషన్ కు డిజైన్లు రూపొందించాలని అధికారుల కు మంత్రి సూచించారు, హైదరాబాద్ లోని జలసాధన లో జరిగిన ఈ సమావేశంలో పర్యటక శాఖ డిప్యూటీ ఈ ఈ నటరాజ్, ఆర్కిటెక్ట్ విజయ్ కుమార్, సివిల్ ఇంజనీర్ వినీత్ పాల్గొన్నారు.
ఆందోల్ నియోజకవర్గం లో చేపట్టనున్న పర్యటక ప్రాంతాల అభివృద్ధి పై మంత్రి
32