బిచ్కుంద డిసెంబర్ 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శనివారం ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది.
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఈ విషయంలో నాణ్యత లోపించరాదని అలాగే స్టోర్ రూమ్ లో నిల్వచేసిన సరుకులను,వంట సామాగ్రిలను తనిఖీ చేసి నాణ్యమైన సరుకులను, తాజా కూరగాయలను వండి, అన్నంలో కూడా జాగ్రత్త తీసుకొని బాలికల ఆరోగ్య దృష్ట్యా మంచి వంటకాలు వండి బాలికలకు భోజన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి ఆదేశించడం జరిగింది.


