Home తాజా వార్తలు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

by Telangana Express

శేరిలింగంపల్లి, జనవరి 31(తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ ):

ప్రజలకు హాని చేకూరుస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దోమల బెడధ నుండి కాపాడి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని మియాపూర్ మక్త గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మున్సిపల్ అధికారులను కోరారు. గత రెండు, మూడు నెలల నుండి శానిటేషన్ సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడం లేదని, ఫాగింగ్ చేయడం లేదన్నారు. చుట్టూ ఉన్న మురికి నీటి నిలువల వల్ల దోమలు విపరీతంగా వ్యాప్తి చెందాయని, అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

You may also like

Leave a Comment