*ప్రిన్సిపల్ గౌతమ్ ఆధ్వర్యంలో*
*ఘనంగా నిర్వహించారు*
లోకేశ్వరం డిసెంబర్ 23
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల కేంద్రంలోని
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కే గౌతమ్ అధ్వర్వంలో గణిత అధ్యాపకుడు సాయినాథ్, ప్రధమ ద్వితీయ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులతో కలిసి గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా వారి యొక్క సేవలను గుర్తు చేశారు సున్నా యొక్క ప్రాముఖ్యతను గణితంని చిన్న చిన్న చిట్కాలను ఎలా నేర్చుకోవాలో వారు సూచించిన ఆవిష్కరణలను విద్యార్థులకు తెలియజేశారు
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారు. రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించి చూపేవారు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో ఎఫ్.ఎ. పరీక్ష తప్పారు. ఆ తరువాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు
అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్. రామానుజాచారి గణిత సమస్యలను కఠినమైన పద్ధతిలో పరిష్కరించి చూపుతుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవారు. రామానుజన్ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ విశేష పరిశోధనలు చేశారు అన్నారు
ఇలాంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గనుక గణితంలోని మెలకువలు చాలా ఇష్టంతో నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే గౌతమ్, అధ్యాపకులు ప్రమీల రాణి, మహేందర్, సాయినాథ్, హరీష్, బోధన సిబ్బంది పాల్లొన్నారు


