Home తాజా వార్తలు బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

by Telangana Express

జుక్కల్ మార్చి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ మండలంలోని బిఎస్పీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన రాజులు సెట్ లాడేగావ్ మాజీ సర్పంచ్ సద్దు పటేల్ , చిన్న ఏడిగి మనోహర్ పటేల్ , పడంపల్లి మాజీ సర్పంచ్ గంగాధర్ , డోన్గావ్ సంతోష అప్ప మరియు వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీ సంఖ్యలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
చేరికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త చేరికల వల్ల నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు..
కష్ట కాలంలో పార్టీ జెండా మోసి తన గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని,అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు..
నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే అవసరం ఉందని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరియు అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఈ చేరికలను ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు..
మరి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు..
రెండు సార్లు ఎంపీగా పని చేసిన బీ బీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ లో చేరడం ఇందుకు నిదర్శనం అన్నారు..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

You may also like

Leave a Comment