Home తాజా వార్తలు పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి

పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 12 తెలంగాణ ఎక్స్ ప్రెస్: శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకొని పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పట్టణ కమిటీ అధ్యక్షులు జెల్లా రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ స్వామి వారికి పూజ కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిర్యాల కృష్ణయ్య, బావండ్ల పాండు, చిలుకూరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రామ ప్రసాద్, కోశాధికారి మసురం కృష్ణమూర్తి, మరియు స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment