Home తాజా వార్తలు బీబీపేట్ లో వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు

బీబీపేట్ లో వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు

by Telangana Express

బీబీపేట్ ఫిబ్రవరి 12 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) పద్మశాలి కుల గౌరవాన్ని ,ప్రత్యేకతను ,సంఘటిత శక్తిని సమాజానికి చాటి చెప్పిన పద్మశాలి వంశ పురుషుడైన భక్త మార్కండేయ జయంతి వేడుకలు సోమవారం బీబీపేట్ మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు .జయంతి కార్యక్రమం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు .ప్రత్యేక పూజలు అభిషేకాలు ,యజ్ఞాలు నిర్వహించారు .కార్యక్రమాలకు ముందు స్థానిక పెద్ద చెరువు నుండి కలశాలతో నీరు తెచ్చి అభిషేకం చేసిన అనంతరం కార్యక్రమాలు నిర్వహించారు .అధిక సంఖ్యలో పురుషులు ,మహిళలు పాల్గొని నిర్వహించిన కలశయాత్ర పట్టణంలో అందరిని ఆకర్షించడం విశేషం ,అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .రాత్రి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమంతో జయంతి వేడుకలు ముగుస్తాయని ఆలయ ,జయంతి వేడుకల నిర్వహణ కమిటి సభ్యులు వివరించారు .

You may also like

Leave a Comment