Home తాజా వార్తలు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న మనోజ్ కుమార్

గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న మనోజ్ కుమార్

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 29( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16 వ స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఎం ఏ లింగ్విస్టిక్స్ (భాషా శాస్త్రం) విభాగంలో ప్రథమ స్థానం పొందిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విశ్వకర్మ విద్యార్థి సజ్జనపు మనోజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తంగేడ కిషన్ రావు ల చేతుల మీదుగా ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ… భవిష్యత్తులో ఇదే భాషా శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందుతానని ఆశాభావం వ్యక్తం చేస్తూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రెడ్డి శ్యామల, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ రంగారావు , యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రమేష్ , వైస్ ఛాన్స్లర్ తంగేడ కిషన్ , గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You may also like

Leave a Comment