
మిర్యాలగూడ డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ మండల విద్యాధికారి బాలునాయక్ ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని
సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంఈఓ బాలు నాయక్ మాట్లాడుతూ
ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన కమిటీ నియమకం చేయాలని వాటిని పాఠశాలలో ప్రదర్శన చేయాలని, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సివిల్ లిస్టు డిస్ప్లే చేయాలి మధ్యాహ్న భోజనం ప్రతిరోజు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన ఏజెన్సీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పాఠశాలకు సమయానికి వెళ్లి పూర్తి సమయం పాఠశాలలో ఉండాలని సూచించడం జరిగింది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి లావూరి బాలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంగ్య నాయక్, కరుణాకర్ రెడ్డి ,మంగళ, ధర్మానాయక్ శ్రీనివాసరావు గణేష్ శిరీష గోపి తదితరులు పాల్గొన్నారు.