మంచిర్యాల, నవంబర్ 14 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామపంచాయతీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం పోనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీలంక కాలనీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాక్సన్ నాయక్ గెలుపు కోసం, ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ప్రభుత్వ పాలన కొనసాగించి, ప్రజలకు అనేక పథకాలు అమలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల కోసం చేసిన అనేక అభివృద్ధి పనులను టిఆర్ఎస్ మినీ పోస్ట్ ను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఖానాపూర్ నియోజకవర్గం అభ్యర్థి బుక్యా జాక్సన్ నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు లెక్కల మల్లయ్య, దుమాల ఎల్లయ్య (రెడ్డి) కుంభాల రాజన్న, శ్రీధర్, శ్రీనివాస్, కృష్ణ, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా నాయకులు భరత్ కుమార్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేసిన మండల నాయకులు
64