Home తాజా వార్తలు మంచిర్యాల జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేయాలి

మంచిర్యాల జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేయాలి

by Telangana Express

జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్

మంచిర్యాల ఏవో రాజేశ్వరరావు వినతి పత్రం అందజేత

మంచిర్యాల, మార్చి 06, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంచిర్యాల జిల్లా ఏవో రాజేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనాటి స్వతంత్ర పోరాటం నుండి నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధన ఉద్యమాల్లో పాల్గొని, జైలు జీవితం గడిపిన పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గుర్తు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన బాపూజీ నాలుగుసార్లు శాసనసభ్యులుగా, ఒకసారి మంత్రిగా పని చేశారు. రాజకీయవేత్త 1969 రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి జైలుకెళ్లిన యోధుడు రాష్ట్ర సాధనకై మంత్రి పదవిని సైతం వదులుకొని రాష్ట్రం సాధించే వరకు ఏ పదవి చేపట్టానని ప్రతిన బునిన వ్యక్తి మలిదశ ఉద్యమంలో తన 97 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ నందు దీక్ష చేసి రాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చిన ఉద్యమకారుడు అలాగే రాష్ట్రంలోనే మొట్టమొదటి బీసీ సంఘం స్థాపించి బీసీల రాజ్యాధికార ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ సరైన గుర్తింపు రావాలంటే మంచిర్యాల జిల్లాకు ఆయన పేరుతోనే సరైన గుర్తింపు లభిస్తుందని బీసీలుగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి భావిస్తున్నామవ్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆకాంక్షను గుర్తించి మంచిర్యాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని బీసీ సంఘం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి బోరే యాదగిరి, పట్టణ అధ్యక్షులు బోడంకి మహేష్, వేముల కిరణ్, గగ్గూరి రాజన్న, అంకం సతీష్, గుమ్ముల నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment