
లోకేశ్వరం జూలై 24
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అప్పుల బాధతో మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలోని మన్మధ్ గ్రామంలో చోటుచేసుకుంది ఎస్సై అశోక్, తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని మన్మధ్ గ్రామానికి చెందిన గందిరి భోజన్న, అనే వ్యక్తి వయసు 45 సంవత్సరాలు గత రెండు సంవత్సరాల క్రితం తన కూతురైన ప్రవళిక,పెళ్లి కి అప్పు చేశారు. పెళ్లికి తెచ్చిన అప్పు తీర్చలేక ఇటు కుటుంబ బాధ్యతలు మోయలేక మద్యం తాగుటకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఈరోజు అనగా 23 7 2025 నాడు అతని భార్య గందిరి లక్ష్మి, పొలం పనులకు వెళ్లిన అనంతరం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని అతని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జి అశోక్, తెలిపారు…