Home తాజా వార్తలు మంచిర్యాల పట్టణంలో మాల మహానాడు జిల్లా విస్తృతస్థాయి సమావేశం

మంచిర్యాల పట్టణంలో మాల మహానాడు జిల్లా విస్తృతస్థాయి సమావేశం

by Telangana Express

మంచిర్యాల, జనవరి 04, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల పట్టణంలోని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గజ్జల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గురువారం జిల్లా పట్టణంలోని సమావేశానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన మాల మహానాడు సోదరులకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచి జిల్లా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు తోగరి సుధాకర్ హాజరయ్యారు. జిల్లా సమావేశంలో మాల మహానాడు సమావేశ ముఖ్య ఎజెండాలు తెలియపరుచుకున్నారు. ఈనెల 6న హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలాని మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోరారు. జిల్లా కేంద్రంలో పాటు అన్ని మండల మున్సిపాలిటీ కేంద్రాల్లో మాల మహానాడు సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జిల్లాలోని మండల, మున్సిపాలిటీ కమిటీలు పూర్తి చేయాలని మండల పెద్దలకు తెలియజేశారు. ఎస్సీ 59 ఉపకులాల ఐక్యత కోసం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సంగం బలోపేతం కోసం ప్రతి ఒక్క మాల కుల సభ్యులు కృషి చేయాలని, జిల్లా అధ్యక్షులు సూచించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ దళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ై ఆశాది పురుషోత్తం, ఉపాధ్యక్షులు జూపాక సుధీర్, పల్తెపు శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పైడిమల్ల నర్సింగ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కలిగిరి కనకరాజు, రాష్ట్ర సీనియర్ నాయకులు పుల్లయ్య సార్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ నస్పూరి నర్సింగ్, రాష్ట్ర నాయకులు భోగి వెంకటగిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతపురి జనార్ధన్, జిల్లా గౌరవ అధ్యక్షులు బైరి మల్ల మొగులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల నరేష్,
జిల్లా ఉపాధ్యక్షులు మార్త కుమారస్వామి, జిల్లా కార్యదర్శి సొల్లు శ్రీనివాస్, జిల్లా ప్రచార కార్యదర్శి గోక శ్రీనివాస్, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment